ETV Bharat / crime

పండగపూట విషాదం... పాముకాటుకు విద్యార్థిని బలి - student death by snake bite

పండగపూట విషాదం చోటుచేసుకుంది. రాత్రి కుటుంబ సభ్యులతో పాటు భోజనం చేసి... ఇంటి ముందు పడుకున్న విద్యార్థిని.. పాముకాటుకు బలైంది.

student death, snake bite
పండగపూట విషాదం... పాముకాటుకు విద్యార్థి బలి
author img

By

Published : Apr 14, 2021, 12:30 PM IST

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జీవుల​ తండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యార్థిని లక్ష్మి పాముకాటుకు గురై మృతి చెందింది. లక్ష్మి మహబూబ్​నగర్​ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో లక్ష్మి మార్చి 20న తన గ్రామానికి వచ్చింది.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో పాటు భోజనం చేసి... ఇంటి ముందు పడుకున్న లక్ష్మి పాముకాటుకు గురైంది. గ్రామస్థులు లక్ష్మిని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. దీనితో పండగపూట తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.