Stephen Ravindra respond purchasing TRS MLAs Incident: తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు దిల్లీకి చెందిన వ్యక్తులు ప్రయత్నించారన్న ఘటనపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారనే సమాచారం వచ్చిందని.. ప్రలోభాల ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. తెరాస ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని వారు ప్రలోభ పెడుతున్నారని తెరాస ఎమ్మెల్యేలు చెప్పారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు తాము ఫామ్‌హౌజ్‌కు వెళ్లామని అన్నారు. ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురిని గుర్తించామని చెప్పారు. ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి.. తిరుపతికి చెందిన సింహయాజీ అనే స్వామిజీ.. హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌తో కలిసి వచ్చారని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపు కోసం ఎమ్మెల్యేలతో చర్చల కోసం వచ్చినట్లు తెలుస్తోందని తెలిపారు. ప్రలోభాల ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
"ఎమ్మెల్యేలు ఎవరో ముగ్గురు వచ్చి మమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు. డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని వారు సమాచారం ఇచ్చారు. అదే విధంగా పార్టీ ఫిరాయింపు చేయాలని వారు అడిగారని సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు తనిఖీలు నిర్వహించాం." - స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ సీపీ
ఇవీ చదవండి: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు.. డబ్బు కట్టలతో పట్టుబడిన నలుగురు వ్యక్తులు