ETV Bharat / crime

Murder: తల్లిని కర్రతో కొట్టి హత్య చేసిన కుమారుడు - జోగులాంబ గద్వాల జిల్లా తాజా వార్తలు

జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామంలో దారుణం జరిగింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిని... కుమారుడు కర్రతో కొట్టి హత్య చేశాడు. మృతురాలి వదిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

son killed his mother
తల్లిని కర్రతో కొట్టి హత్య చేసిన కుమారుడు
author img

By

Published : Jun 24, 2021, 9:26 AM IST

మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిని... కుమారుడు కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన... జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసరి శాంతమ్మ రెండో కుమారుడు వెంకటేశ్‌... కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. రెండు వివాహాలు చేసుకున్న అతను... భార్యలతో పాటు తల్లినీ డబ్బుల కోసం వేధించేవాడు.

ఆ భాదలను తట్టుకోలేక వెంకటేశ్​ ఇద్దరు భార్యలు పుట్టింటికి వెళ్లిపోగా..... తల్లితో కలిసి ఉంటున్నాడు. మద్యం మత్తులో డబ్బులు ఇవ్వాలని తల్లితో మంగళవారం గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి శాంతమ్మను కర్రతో తలమీద గట్టిగా బాదాడు. గాయపడిన శాంతమ్మ అక్కడిక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వదిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: కరోనా చికిత్సకు పాత ధరలు.. అమలుచేయకపోతే కఠిన చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.