ETV Bharat / crime

Murder: భూమి కోసం తండ్రినే కొట్టి చంపిన కొడుకు

author img

By

Published : Jun 27, 2021, 8:08 AM IST

కన్నకొడుకే తండ్రి పాలిట కాలయముడయ్యాడు. రక్త బంధం కంటే భూమికే ప్రాధాన్యమిచ్చిన కొడుకు... తండ్రిని పారతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తండ్రిని చంపిన కొడుకు
తండ్రిని చంపిన కొడుకు

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ తగాదా విషయంలో తండ్రిని కొడుకు పారతో తలపై కొట్టి చంపేశాడు. సముద్రాలకు చెందిన అట్ల కనకయ్య(70)కు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన భార్య ఆరేళ్ల కిందట చనిపోయింది. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు వీరేందర్‌ (34) ఉన్నారు. కొడుకు లారీ డ్రైవర్‌గా పని చేస్తూ... రెండేళ్లుగా అదే గ్రామంలోనే ఉంటున్నాడు. తండ్రి పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తన పేరిట మార్చాలని కొంతకాలంగా అడుగుతూ వస్తున్నాడు. ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య ఏడాదిగా గొడవలు జరుగుతున్నాయి.

ఆరు నెలల క్రితం పెద్ద మనుషులు ఇచ్చిన తీర్పులో భూమి తండ్రి పేరిటే ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు పెట్టుబడి సాయం తండ్రికే చెందుతుందని తెలిపారు. భూమి మాత్రం కొడుకు సాగు చేసుకోవాలని సూచించారు. తండ్రి గతంలో బ్యాంకులో తీసుకున్న పంట రుణాన్ని కూడా కొడుకే చెల్లించాలని తీర్మానించారు. ఇందుకు తండ్రీకొడుకులు ఇద్దరూ అంగీకరించారు.

పెద్ద మనుషుల తీర్పు ప్రకారం కొడుకు గత యాసంగిలో పంటసాగు చేసి పండించిన ధాన్యం విక్రయించాడు. పంట రుణం మాత్రం చెల్లించలేదు. తండ్రి కనకయ్య ప్రశ్నించగా కొడుకు నుంచి సమాధానం రాలేదు. రెండు రోజుల క్రితం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన తండ్రి... అక్కడ మోటారుకు సంబంధించిన ఫ్యూజులు తొలగించి వెంట తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించి శనివారం మధ్యాహ్నం బావి వద్ద తండ్రీకొడుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఆవేశానికి లోనైన కుమారుడు వీరేందర్‌ చేతిలో ఉన్న పారతో తండ్రి తలపై బలంగా కొట్టడంతో కిందపడడ్డాడు. అప్పటికీ ఊరుకోని వీరేందర్​... తండ్రి గొంతు పిసికి హత్య చేశాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఇరుగు పొరుగు వారికి జరిగిన విషయం చెప్పగా వారు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ మహేందర్‌, సీఐ రఘుపతిరెడ్డి, ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. హత్యకు ఉపయోగించిన పారను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని పెద్ద కుమార్తె సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: నాకే పునుగులిస్తావా.. నీ అంతుచూస్తా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.