ETV Bharat / crime

తండ్రి చనిపోయిన గంటకే కొడుకు మృత్యువాత - Tragedy in medak district

అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి చనిపోయిన గంటకే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడుకు సైతం ప్రాణాలు వదిలిన విషాద ఘటన తూప్రాన్‌ పురపాలిక పరిధి పడాలపల్లిలో చోటు చేసుకుంది.

The son died within an hour of the father's death
తండ్రి చనిపోయిన గంటకే కొడుకు మృత్యువాత
author img

By

Published : May 10, 2021, 8:51 AM IST

మెదక్​ జిల్లా పడాలపల్లి గ్రామానికి చెందిన కానుకుంట యాదయ్య(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆయన కొడుకు కృష్ణ (34) కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతూ మూడు రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తండ్రి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగానే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడుకు కృష్ణ చనిపోయినట్లు సమాచారం వచ్చింది.

ఒకే రోజు తండ్రీకొడుకులు అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. యాదయ్య భార్య నర్సమ్మ, కృష్ణ భార్య లక్ష్మి ఆమె ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్‌ అరుణ భర్త వెంకటేశ్‌ గౌడ్‌ దగ్గరుండి తండ్రీ కొడుకుల అంత్యక్రియలు పూర్తి చేయించారు.

ఇదీ చదవండి: పల్లెలను కబళిస్తున్న కరోనా మహమ్మారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.