ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి పట్టణం దాసరి వీధి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రిపై వేట కొడవలితో కుమారుడు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల కారణంగా తండ్రి రామచంద్రపైన.. తనయుడు అశోక్ అతి దారుణంగా వేటకొడవళ్లతో దాడి చేశాడు.
ఈ దాడిలో తండ్రి తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: దారుణం: తండ్రిని పొడిచి చంపిన తనయుడు