Soldier revolver stolen: సైనికుడి రివాల్వర్ చోరీకి గురైన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరిగింది. జమ్మూ-కశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తోన్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ సికిందర్ అలీ సెలవుపై ఇంటికి వచ్చి ఉదయం జహీరాబాద్ బస్టాండ్‌లో దిగాడు. బస్టాండ్‌లోని టాయ్‌లెట్‌కు వెళ్లి గోడపై రివాల్వర్ పెట్టి మర్చిపోయాడు.
స్వగ్రామం సిర్గాపూర్ వెళ్లేందుకు నిజామాబాద్ బస్సు రావడంతో హడావిడిగా బస్సు ఎక్కి బయలుదేరాడు. నారాయణఖేడ్ చేరుకోగానే రివాల్వర్ పోగొట్టుకున్న విషయం గుర్తించిన సైనికుడు.. జహీరాబాద్ బస్టాండ్‌కి చేరుకోగా రివాల్వర్ కనిపించలేదు. బస్టాండ్‌లోని టాయ్‌లెట్ నిర్వాహకుల వద్ద ఆరా తీసినా రివాల్వర్ దొరకకపోవడంతో జహీరాబాద్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐటీబీపీ రివాల్వర్ చోరీ ఘటనపై జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చదవండి: