ETV Bharat / crime

software employee suicide: పెళ్లికావడం లేదని సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య - తెలంగాణ తాజా వార్తలు

పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డిలో జరిగింది.

suicide
suicide
author img

By

Published : Aug 27, 2021, 4:58 PM IST

ముంబయిలోని ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో ఉద్యోగం. మంచి జీతం. అయినా చానాళ్లుగా పెళ్లికావడం లేదు. ఎంతకీ తనకు పెళ్లికాకపోవడం వల్ల మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన రాజ్​కుమార్​(28) ముంబయిలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొవిడ్​ సమయంలో ఇంటికొచ్చి ఇక్కడి నుంచే పనిచేస్తున్నాడు.

జీవితంలో స్థిరపడిన రాజ్​కుమార్​కు... కుటుంబ సభ్యులు కొన్నాళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినప్పటికీ ఏదీ కుదరడం లేదు. ఎప్పటికీ పెళ్లికాదని మనస్తాపం చెందిన రాజ్​కుమార్​... ఇంట్లో దూలానికి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికి అందొచ్చిన కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: DHARNA ON HIGHWAY: జాతీయ రహదారిపై వివాహిత కుటుంబ సభ్యుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.