ETV Bharat / crime

Software Suicide: 'వర్క్​ ఫ్రం ఆఫీస్​'కు సిద్ధమై.. అంతలోనే చెరువులో దూకి విగతజీవై..

Software Suicide: చెరువులో దూకి సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. వర్క్​ ఫ్రం హోమ్​ తర్వాత ఉద్యోగంలో చేరేందుకు ఆదివారం సాయంత్రం మంగళగిరి నుంచి తల్లిదండ్రులతో కలసి హైదరాబాద్ వచ్చేందుకు శనివారమే అన్ని సర్ధుకుంది. ఇంతలో ఏమైందో.. శనివారం రాత్రి 8 గంటలకు.. "నేను చనిపోతున్నా.." అని తల్లిదండ్రులకు వాట్సప్​లో మెస్సేజ్​ పంపింది. ఆ తర్వాత..

soft-ware-employee-suicide-in-ntr-district

author img

By

Published : Jul 3, 2022, 4:59 PM IST

Software Suicide: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్వేతా చౌదరి.. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరిన శ్వేత.. చిల్లకల్లు చేరుకొని పక్కనే ఉన్న చెరువులో దూకి చనిపోతున్నట్లు తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్​ను షేర్ చేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చిల్లకల్లు బయలుదేరి వెళ్లి.. చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా.. తెల్లవారుజామున మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం శవ పంచనామ నిమిత్తం మృతదేహాన్ని జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్​లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్వేత.. మూడు నెలలుగా మంగళగిరిలోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తుందని ఆమె తాత తెలిపారు. ఆదివారం సాయంత్రం మంగళగిరి నుంచి తల్లిదండ్రులతో కలసి హైదరాబాద్ వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకుందని వివరించారు. శనివారం సాయంత్రం పని ఉందని ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లిన శ్వేత.. రాత్రి 8 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మెసేజ్ వచ్చిందని ఆయన చెప్పారు. తమకు ఎవరి పైనా అనుమానం లేదని.. మృతికి గల కారణాలు ఇప్పుటి వరకు తెలియదని అన్నారు. అందరితో కలివిడిగా ఉండే తమ మనవరాలు విగత జీవిగా పడి ఉండటాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.