ETV Bharat / crime

మైనర్​ ట్రాక్టర్​ డ్రైవింగ్​.. మితిమీరిన వేగానికి ఆరేళ్ల చిన్నారి బలి.. - మైనర్​ ట్రాక్టర్​ డ్రైవింగ్

Tractor Accident minor dead: గేదెలొస్తున్నాయని భయపడి రోడ్డుపక్కనే ఆగిపోయిన ఆ చిన్నారిని ట్రాక్టర్​రూపంలో దూసుకొచ్చిన మృత్యువు మింగేసింది. రోడ్డుపై వస్తున్న గేదెలను గమనించిన ఆ చిన్నారి.. దూసుకొచ్చిన ట్రాక్టర్​ని చూడలేకపోయింది. ఆ ట్రాక్టర్​ని ఓ మైనర్​ నడపడటం మొదటి తప్పైతే.. మితిమీరిన వేగంతో నడపటం రెండో తప్పు.

six years girl died in tractor accident driving by minor boy at maarupaaka

author img

By

Published : Feb 20, 2022, 4:47 PM IST

Tractor Accident minor dead: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాకలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్​ను ఓ మైనర్ అతివేగంగా నడపడం వల్ల ఓ ఆరేళ్ల చిన్నారి బలైంది. గ్రామానికి ఇటుకలు తీసుకొచ్చేందుకు ట్రాక్టర్​ను ఓ మైనర్​తో పాటు మరో బాలుడు నడపుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డుపై ఎవరూ లేరనే ఉద్దేశంతో ఆ బాలుడు ట్రాక్టర్​ను మితిమీరినవేగంతో నడుపుతూ వెళ్లాడు. తీరా.. బస్టాండ్ వద్దకు రాగానే.. గేదేలతో పాటు ఓ మహిళ ఎదురుగా వస్తోంది. గేదేలను ఎలా తప్పించుకోవాలో తెలియక.. వేగాన్ని నియంత్రించలేక ఒక్కసారిగా బ్రేక్​ వేశాడు. కట్​ చేస్తే ట్రాక్టర్​ వెళ్లి కాలువలో పడింది.

గేదెలు వస్తున్నాయని ఆగితే..

బ్రేక్​ వేయడానికి.. ట్రాక్టర్​ కాలువలో పడటానికి మధ్యలో ఓ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ ట్రాక్టర్​ వస్తున్న సమయంలోనే.. రోడ్డుపై వస్తున్న గేదెలను చూసి ఆరేళ్ల బాలిక దీక్షశ్రీ.. పక్కనే నిలబడిపోయింది. గేదెలు వెళ్లాక వెళ్దామనుకున్న దీక్షశ్రీ.. అటుగా దూసుకొస్తున్న ట్రాక్టర్​ను గమనించలేకపోయింది. అదుపుతప్పిన ఆ ట్రాక్టర్​ నేరుగా వచ్చి దీక్షశ్రీని ఢీకొట్టుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీక్షశ్రీ అక్కడికక్కడే మరణించింది. కాలువలో పడిన ట్రాక్టర్​ నుంచి ఇద్దరు బాలురు క్షేమంగానే బయటపడ్డారు.

అతివేగమే కారణం..

ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ఉలిక్కిపడ్డ స్థానికులు.. ట్రాక్టర్​ యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్​కు ట్రాక్టర్ ఎందుకు ఇచ్చారని ట్రాక్టర్ యజమాని పరశురాములును నిలదీశారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమేనని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.