ETV Bharat / crime

Road accidents: నెత్తురోడిన రహదారులు.. ఆరుగురు దుర్మరణం - ఆరుగురు దుర్మరణం

ఏపీలో రహదారులు రక్తమోడుతున్నాయి. వేరు వేరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

road accidents at kurnool and vizianagaram districts today
ఆరుగురు దుర్మరణం
author img

By

Published : Mar 11, 2022, 10:00 PM IST

ఏపీలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు ఈ ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు.

కర్నూలు జిల్లాలో ముగ్గురు..

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. పెద్దకడబూరు మండలం బసలదొడ్డి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను చిన్నతుంబళం గ్రామస్థులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విజయనగరంలో జిల్లాలో ముగ్గురు

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. కొత్తవలస మండలం దేశుపాత్రునిపాలెం వద్ద ప్రమాదం జరిగింది. యువకులు పెందుర్తి నుంచి కొత్తవలస వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: లోయలో పడిన బస్సు- 14 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.