ETV Bharat / crime

living with dead body: ఓ యువతి నిస్సహాయత.. చెల్లి మృతదేహంతో నాలుగు రోజులు - చెల్లెలి మృతదేహంతో జీవనం

living with dead body: అయినవాళ్లు లేకపోవడంతో చెల్లెలి మృతదేహం పక్కనే నాలుగురోజులు సోదరి గడిపిన విషయం పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో చెల్లి శ్వేత మృతి చెందినట్లు అక్క స్వాతి తెలిపింది. చెల్లెలు మృతిచెందిన విషయం బయటకు చెప్పకుండా నాలుగు రోజులుగా అదే ఇంట్లో నివసిస్తోంది.

living with dead body
చెల్లెలి మృతదేహంతో నాలుగు రోజులుగా సోదరి
author img

By

Published : Jan 18, 2022, 5:41 AM IST

living with dead body: చెల్లెలి మృతదేహంతో నాలుగు రోజులుగా సోదరి కలిసి జీవించిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రగతి నగర్​లో నివసించే మారోజు శ్వేత(24) నాలుగు రోజుల క్రితం మృతి చెందింది. చెల్లెలు మృతిచెందిన విషయం బయటకు చెప్పకుండా అక్క స్వాతి నాలుగు రోజులుగా అదే ఇంట్లో జీవనం సాగిస్తోంది.

dead body: శ్వేత, ఆమె అక్క స్వాతి సొంత ఇంట్లో నివసిస్తున్నారు. శ్వేత ఎంబీఏ పూర్తిచేయగా స్వాతి ఎంటెక్‌ చదివి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో పనిచేస్తోంది. నాలుగురోజుల క్రితం శ్వేత మృతి చెందగా సంబంధీకులు, బంధువులు లేకపోవడం వల్ల ఎవరికీ చెప్పాలో తెలియక సోదరి మృతదేహం పక్కనే ఉండిపోయింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. స్వాతిని విచారించగా తన చెల్లెలు అనారోగ్యంతో మృతిచెందిదని తెలిపింది. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహానికి వైద్యులు అక్కడిక్కడే పంచనామా నిర్వహించారు. వారి అమ్మ, నాన్న గతంలోనే మరణించారు. గతంలో నానమ్మ, అమ్మమ్మ చనిపోయినప్పుడు అక్కాచెల్లెళ్లు రెండు, మూడు రోజులు ఎవరికీ చెప్పలేదని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.