ETV Bharat / crime

అక్రమంగా ఇసుక తరలిస్తోన్న 8 ట్రాక్టర్లు సీజ్ - sand tractors seize

పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లోని ఇసుక మాఫియాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతోన్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాలుగా.. మంథని మండలంలో 18 ట్రాక్టర్లను, ముత్తారం మండలంలో 10 ట్రాక్టర్లను సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచారు. 

sand mafia
sand mafia
author img

By

Published : Jun 13, 2021, 11:29 AM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు సమీపంలోని గోదావరి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తోన్న 8 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమ రవాణాకు పాల్పడుతోన్న నిందితులను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్ చేశారు.

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతోన్న వారిపై పోలీసులు గత 15 రోజులుగా ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాలుగా.. మంథని మండలంలో 18 ట్రాక్టర్లను, ముత్తారం మండలంలో 10 ట్రాక్టర్లను సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంథని ఎస్సై చంద్ర కుమార్ హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: సైఫాబాద్ నిజాం క్లబ్‌లో అగ్నిప్రమాదం... దగ్ధమైన ఫర్నిచర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.