ETV Bharat / crime

భార్యను హతమార్చిన భర్త.. విచారణలో షాకింగ్ విషయాలు!

భార్యను హత్య చేశాడు. పది రోజుల తరువాత పోలీసులకు చిక్కాడు. హత్యకు కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఎందుకు హత్య చేయాల్సిందో కారణాలు చెప్పాడు. అతడు చెప్పిన విషయాలతో పోలీసులు షాక్​కు గురయ్యారు. "మీ పోలీసుస్టేషన్​లో పని చేస్తున్న ఓ ఎస్సై తీరే ఈ హత్యకు కారణం" అంటూ నిందితుడు చెప్పటం... పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

crime news
crime news
author img

By

Published : Apr 12, 2021, 12:24 PM IST

ఆంధ్రప్రదేశ్ గుంటూరు​ జిల్లాలో ఇటీవల ఓ భార్యను ఆమె భర్త కత్తులతో నరికి హతమార్చిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని ఎట్టకేలకు పదిరోజులు గాలించి అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు చంపాల్సి వచ్చిందనేది విచారించి రికార్డుల్లో నమోదు చేసి అతడిని అరెస్టు చూపించాలనుకున్నారు. ఈక్రమంలో సదరు నిందితుడు తన భార్య హత్యకు ఓ ఎస్సై కారణమంటూ ఆరోపించినట్లు తెలిసింది. అది కూడా ఆదే పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఎస్సై పేరు చెప్పడంతో అధికారులు నిర్ఘాంతపోతున్నారు. ఏ పరిస్థితుల్లో తన భార్యను హత్య చేయాల్సి వచ్చిందో...అంటూ నిందితుడు చెప్పిన విషయాలు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

విచారణలో నిందితుడు ఆరోపించిన అంశాలు విశ్వసనీయ సమాచారం మేరకు..‘జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. మద్యానికి బానిసైన భర్త తరచూ తన భార్యతో గొడవ పడేవాడు. ఆమెపై అనుమానంతో హింసించేవాడు. అతని వేధింపులు భరించలేక ఆమె సమీపంలోని ఓ పోలీసుస్టేషన్‌లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఓ ఎస్సై ఆమెతో పరిచయం పెంచుకొని సన్నిహితంగా మెలుగుతుండేవాడు. ఆమెతో తరచూ ఫోన్‌లో ఛాటింగ్‌లు చేస్తుండేవాడు. ఈ విషయం పసిగట్టిన భర్త ఆమెను పద్ధతి మార్చుకోవాలంటూ మందలించాడు. ఆ విషయం తెలుసుకున్న సదరు ఎస్సై పలుమార్లు భర్తను స్టేషన్‌కు పిలిపించి ఆమె పెట్టిన కేసు విచారిస్తున్నట్లు చెప్పి పలు రకాలుగా వేధింపులకు గురిచేశాడు. అయినా అవన్నీ భరించి ఆమెతో రాజీ చేసుకోవడానికి భర్త యత్నించాడు. ఎస్సైతో ఉన్న పరిచయంతో ఆమె భర్తపై అనేక కేసులు పెడుతూ నానా తిప్పలు పెడుతోంది. ఒకపక్క భార్య కాపురానికి రాకుండా ఇబ్బంది పెట్టడం..మరోపక్క ఎస్సై బెదిరింపులు భరించలేక మానసికంగా కుంగిపోయాను. వాళ్లిద్దరూ కలసి నాపై ఉద్దశపూర్వకంగా వేధింపులకు దిగుతున్నట్లు భావించాను.

ఈవిషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే మళ్లీ అదే స్టేషన్‌కు వెళ్లాలి. మళ్లీ ఆ ఎస్సై నాపై మరింత కక్ష పెంచుకొని ఏం చేస్తాడో అనిపించింది. దీంతో విసిగిపోయి నేను నా భార్యను హతమార్చాల్సి వచ్చింద’ని ఆరోపించినట్లు తెలిసింది. అయితే నిందితుడు ఆ ఎస్సైపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నాడా? కేసును తప్పు దారి పట్టించాలని యత్నిస్తున్నాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. హత్య ఘటన జరిగాక సదరు ఎస్సై ఎప్పుడూ లేని విధంగా ఈ కేసులోని నిందితుడిని తానే అరెస్టు చేసి తీసుకు వస్తానంటూ కొంత ఉత్సాహం చూపించడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. నిందితుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఎస్సై స్వయంగా అదుపులోకి తీసుకోవడంతో నిందితుడు చేసిన ఆరోపణల్లో కొంత వాస్తవం ఉందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలు బయటకు పొక్కనీయకుండా రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

ఇవీచూడండి: రాష్ట్రంలో విజృంభిస్తున్న వైరస్... మరో ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.