Shilpa Chowdary Cheating Case: పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి.. ఈ రోజు బెయిల్‌పై విడుదలైంది. చంచల్‌గూడ జైలులో రిమాండ్లో ఉన్న శిల్పకు ఉప్పర్పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
3 కేసులు రూ.7 కోట్లు
పెట్టుబడులు, లాభాల పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో దాదాపు నెల క్రితం శిల్ప అరెస్టయింది. 3 కేసుల్లో 7 కోట్ల రూపాయల మోసం చేసినట్లు ఆమెపై కేసులు నమోదయ్యాయి. పలుమార్లు కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆమెపై నమోదైన మూడు కేసుల్లోనూ బెయిల్ లభించింది. ఈ మేరకు ప్రతి శనివారం నార్సింగి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో శిల్ప దాదాపు 25 రోజుల పాటు జైలులోనే ఉంది.
ఇదీ చదవండి: Shilpa Chowdary Custody news : 'కోట్ల రూపాయలను ఎక్కడకు మళ్లించారు?'
Shilpa Chowdary Cheating Case: ముగిసిన శిల్పా చౌదరి కస్టడీ... ఆమె బ్యాంకు లాకర్లలో ఏమున్నాయంటే..!