ETV Bharat / crime

Vijayawada Rape news : గంజాయి మత్తు.. మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి - తెలంగాణ వార్తలు

Vijayawada Rape news : రోజు రోజుకు మహిళలు, బాలికలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా.. కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. పసి పిల్లల నుంచి వృద్ధులు, మతిస్థిమితం సరిగాలేని వారు ఇలా ఎవరినీ వదలకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. గంజాయి మత్తులో యువకులు.. మతిస్థిమితం సరిగా లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు .

Vijayawada Rape news, vijayawada crime news
మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి
author img

By

Published : Jan 11, 2022, 5:31 PM IST

Vijayawada Rape news : ఆంధ్రప్రదేశ్ విజయవాడ అజిత్​సింగ్ నగర్ వాంబే కాలనీ జీ బ్లాక్​లో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళపై గుర్తుతెలియని కొందరు యువకులు గంజాయి మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆనంతరం మహిళను తీవ్రంగా గాయపరిచారు.

ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు సంచరిస్తుండటంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులు ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిఘా పెంచారు. స్తబ్దతగా ఉన్న సమయంలో మళ్లీ ఈ సంఘటన వెలుగులోకి రావటంతో స్థానికులకు కలవరపాటుకు గురవుతున్నారు. ఈఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి : Wife kills husband in Kamareddy : భర్తను చంపిన భార్య.. కారణాలు అవేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.