ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్లు గ్రామంలో బుధవారం ఇరువర్గాలు కర్రలతో దాడి(two families attack with sticks at arekallu) చేసుకున్నారు. ఓ ఇంటి నిర్మాణం విషయంలో జరిగిన దాడిలో ఇరు కుటుంబాలకు చెందిన ఏడుగురి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలు(seven members injured due to attack with sticks at arekallu) అయ్యాయి. వాళ్లను చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
గ్రామంలో లక్ష్మణ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఇల్లు నిర్మాణం చేస్తుండగా రాళ్లు తిమ్మరెడ్డి ఇంటి దగ్గర పడడంతో ఘర్షణ(attack with sticks at arekallu) మొదలైందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో ఇరువురు పరస్పర దాడులు చేసుకున్నాయి. గాయపడ్డవారికి ఆదోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని ఇరు కుటుంబాలకు చెందిన 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి.. Niranjan Reddy saval: 'సాయంత్రంలోగా యాసంగి పంటను కొంటామని కేంద్రం నుంచి లేఖ తెప్పించండి'