Buses Fire Accident In Ongole : ఆంధ్రప్రదేశ్ ఒంగోలు ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో పార్కింగ్ చేసిన ప్రైవేటు బస్సులకు మంటలు అంటుకుని భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 7 బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
బస్సులు కావేరి ట్రావెల్స్‌కు చెందినవిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉడ్ కాంప్లెక్ ప్రాంతానికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు చెలరేగడానికి కారణమేంటో తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: పండుగ పూట విషాదం.. ప్రాణహిత నదిలో తల్లీకొడుకు గల్లంతు