పెళ్లిచేసుకుంటానని నమ్మించి ఓ బాలికను అపహరించి గర్భవతిని చేసిన వ్యక్తికి సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జీవిత ఖైదుతో పాటు రూ.20 వేలు జరిమానా విధించింది. రంగారెడ్డి జిల్లా వనస్థలీపురానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కూమార్తెలతో కలిసి నివసిస్తోంది. వారింటి సమీపంలోనే ఉంటున్న ఆంజనేయులు(25) స్థానికంగా కులీ పనిచేస్తూ తన భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆంజనేయులు సదరు మహిళ పెద్ద కూతురు(15)తో చనువుగా ఉండేవాడు.
పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి 2015 సెప్టెంబర్ 29న బాలికను అపహరించాడు. బాలిక తల్లి వనస్థలీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న నిందితుడు బాలికను అక్టోబర్ 1, 2015న తీసుకువచ్చి వదిలేశాడు. అప్పటికే ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భవతి అయ్యింది. మహిళ ఫిర్యాదుతో పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సాక్షాధారాలు పరిశీలించిన కోర్టు నిందితుడికి జీవిత ఖైదుతో పాటుగా 20వేల జరిమానా విధించింది.
ఇదీ చదవండి: చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్