రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫాంహౌస్‌లో పేకాట కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అతని నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. చాలా మంది ప్రముఖులతో పాటు.. పలువురు ప్రజాప్రతినిధులతో గుత్తా సుమన్ పరిచయాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పేకాట శిబిరాలకు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపించిన సుమన్ పలువురు ప్రజాప్రతినిధులతో పాటు.. ప్రముఖులను సుమన్ ఆహ్వానించాడు. ఇదివరకు గోవా, శ్రీలంక సుమన్ క్యాసినోలు నిర్వహించేవారు. తెలుగురాష్ట్రాల నుంచి పలువురిని అక్కడకు తీసుకెళ్లాడని దర్యాప్తులో తేల్చారు. గోవాకు బదులు నగర శివారులో పేకాట శిబిరాలు ఏర్పాటు చేసిన సుమన్.. ఫాంహౌస్‌ల్లో సకల సౌకర్యాలతో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని విచారణలో బయటపడింది.
శివలింగ ప్రసాద్ అనే వ్యక్తి నుంచి ఫామ్‌హౌజ్ జన్మదిన వేడుకల కోసం సుమన్ అద్దెకు తీసుకున్నాడు. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని నార్సంగి పోలీసులు సేకరిస్తున్నారు. మంచిరేవుల ఫామ్ లీజ్ అగ్రిమెంట్‌పై ఆరా తీస్తున్నారు. లీజ్ అగ్రిమెంట్ పత్రాలు తీసుకురావాలని శివలింగ ప్రసాద్ అనే వ్యక్తికి పోలీసులు సూచించారు. అతను పోలీస్ స్టేషన్‌కు రాకపోవడంపై... ఫామ్ హౌజ్ అసలు యజమానిని నార్సింగి పోలీసులు సంప్రదించారు. జూలై నెలలో లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారని.... ఏడాదిన్నరపాటు ఉండేలా ఒప్పందం చేసుకున్నట్లు ఫామ్ హౌజ్ యజమాని పోలీసులకు తెలిపాడు. లీజ్ అగ్రిమెంట్ చేసుకున్న శివలింగప్రసాద్‌కు గుత్తా సుమన్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి పోలీసులు తెలుసుకుంటున్నారు. నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్, శివలింగప్రసాద్ మధ్య ఉన్న బంధుత్వం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. గుత్తా సుమన్‌పై గతంలో ఉన్న కేసుల చిట్టాను పోలీసులు తెలుసుకుంటున్నారు.
ఇవీ చదవండి:
- Naga Shourya farmhouse issue: చుట్టూ బాడీగార్డులు.. ప్రముఖులతో వాట్సాప్ గ్రూపులు
- Drugs in Farmhouses: ఆటాపాట.. సయ్యాట.. కొన్నింటిలో మత్తు పదార్థాల వినియోగం
- Gambling Case: యంగ్ హీరో ఫాంహౌస్‌లో పేకాట.. మాజీ ఎమ్మెల్యే సహా 30 మంది అరెస్ట్
- Naga Shaurya farm house case: పోలీస్ స్టేషన్‌కు నేడు హీరో నాగశౌర్య తండ్రి