Seizure of Gold In Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం ఏదో రకంగా వస్తువులు, బంగారంను స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. అధికారుల తనిఖీలకు దొరకకుండా వారు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు అధికారులు. తాజాగా వేర్వేరు ఘటనల్లో విదేశాల నుంచి తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మంది ప్రయాణికుల కదలికలపై అనుమానంలో అధికారులు వారి బ్యాగులను తనిఖీ చేయగా ఈ గుట్టు బయటపడింది. వారి వద్ద నుంచి 1.89 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో దుబాయ్ నుంచి వచ్చిన మహిళ ప్రయాణికురాలి షూలో దాచిన 514 గ్రాముల బంగారం, మరు అనే ప్రయాణికుడి వద్ద 100 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. 10 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: పరాయి మహిళలపై వ్యామోహం.. భర్తపై వేడి నూనె పోసిన భార్య
దిల్లీలో టపాసులపై నిషేధం పొడగింపు.. ఈసారీ నిశబ్దంగానే దీపావళి!