కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం రోల్లపహాడ్లో నకిలీ విత్తనాలను (Counterfeit Seeds) నిల్వ ఉంచిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాల విలువ సుమారు రూ. 64 వేలు ఉంటుందని ఎస్సై భవాని సేన్ తెలిపారు.
నకిలీ విత్తనాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి, మంచి దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.
ఇదీ చదవండి: Suicide: ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య