ETV Bharat / crime

VIRAL VIDEO:కేసు పెట్టిందని మహిళపై ఎలా దాడి చేశారో చూడండి

author img

By

Published : Jun 12, 2021, 9:41 AM IST

Updated : Jun 12, 2021, 9:49 AM IST

నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ మహిళపై కొంత మంది మహిళలు దాడి చేసిన దృశ్యాలు వైరల్​గా మారాయి. ఇంటి నిర్మాణం విషయంలో వచ్చిన విభేదాలతో మహిళపై ఈ దాడికి పాల్పడ్డారు.

Scenes of an attack on a woman in Nagar Kurnool district have gone viral
మహిళపై దాడి... వీడియో వైరల్

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని జేపీ నగర్​లో ఓ మహిళపై కొంతమంది మహిళల దాడి చేసిన దృశ్యాలు వైరల్​గా మారాయి. జేపీ నగర్​కు చెందిన హనుమంతు లక్ష్మి.. తన స్థలంలో ఇంటి నిర్మాణ పనుల ప్రారంభం కోసం మూడు రోజుల కిందట ప్రయత్నం చేశారు. ఆ స్థలం ఆమెది కాదని కొందరు వారించి అడ్డుకున్నారు. దీంతో లక్ష్మీ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

శుక్రవారం ఇంటి నిర్మాణ పనుల కోసం మహిళ అక్కడికి వెళ్లగా.. తమపైనే కేసు పెడతావా అంటూ కొందరు మహిళలు లక్ష్మిపై దాడికి దిగారు. పోలీసులు వారించినా వినకుండా దాడి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించినా వినకుండా చేతికి దొరికిన దానితో కొట్టారు. దీంతో దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా​ మారాయి.

VIRAL VIDEO:కేసు పెట్టిందని నడిరోడ్డు మీద మహిళపై దాడి.

ఇదీ చూడండి: CM KCR: 19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ

Last Updated : Jun 12, 2021, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.