RTC bus overturned: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15మంది గాయపడ్డారు. తమిళనాడులోని తిరుపత్తూరు నుంచి 35మంది ప్రయాణికులతో కుప్పం బయలుదేరిన బస్సు.. చందం గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. స్థానికులు వెంటనే బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీసి, గాయపడిన వారిని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పినట్లు డ్రైవర్ తెలిపాడు. ఇదిలావుంటే బస్సు కండిషన్‌లో లేకపోవటమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: