Bus Driver Misbehavior: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలితో ఓ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఏపీలోని నెల్లూరు 1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి విశాఖకు వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్ జనార్దన్.. బస్సులో ఒంటరిగా ఉన్న మహిళ పట్ల చెడుగా ప్రవర్తించాడు. సదరు మహిళ ఈ మేరకు విజయవాడలో పీఎన్‌బీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసింది.
మహిళ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేసిన ఉన్నతాధికారులు.. తక్షణమే డ్రైవర్‌ను విధుల నుంచి తప్పించారు. మరో డ్రైవర్‌తో బస్సును విశాఖ పంపారు. సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: MURDER IN NIZAMABAD: వ్యక్తి దారుణ హత్య... గొడవలే కారణమా.?