ETV Bharat / crime

యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది అరెస్ట్ - Attack with Knife on student latest crime news

Rohit arrested for attacking young woman with knife in nalgonda district
యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది అరెస్ట్
author img

By

Published : Aug 10, 2022, 1:44 PM IST

Updated : Aug 10, 2022, 2:50 PM IST

13:39 August 10

ప్రేమోన్మాది మీసాల రోహిత్ అరెస్ట్: నల్గొండ ఎస్పీ

Rohit arrested for attacking young woman with knife: నిన్న నల్గొండలో ఫారెస్ట్ పార్క్‌లో అమ్మాయిపై హత్యాయత్నం కేసులో ప్రేమోన్మాది మీసాల రోహిత్​ను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. గతంలోనూ నిందితుడు బాధితురాలిని సీసాతో బెదిరించాడని చెప్పారు. ఈ కేసును వ్యక్తిగతంగా తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. మహిళల రక్షణ కోసం పోలీస్‌శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణలోని షీ టీంలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. నిందితుడు స్నేహితుడికి, బాధితురాలి స్నేహితురాలికి దాడి చేస్తారని తెలియదని ఎస్పీ రెమా రాజేశ్వరి చెప్పారు.

అసలేం జరిగిదంటే: నల్గొండలో డిగ్రీ కళాశాల విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తున్న విద్యార్థి రోహిత్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో విద్యార్థినికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం విద్యార్థినికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

విద్యార్థిని తన స్నేహితురాలితో కలిసి ఫారెస్ట్ పార్క్‌కు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినిని పార్క్‌ నుంచి పక్కకు తీసుకెళ్లిన రోహిత్ కత్తితో మెడ, కడుపుభాగం, ముఖం, కాళ్లపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కొంతకాలంగా రోహిత్‌ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాధితురాలి తండ్రి వెల్లడించారు. అతని ప్రేమను నిరాకరించడం వల్లే రోహిత్‌ దాడి చేశాడని ఆయన తెలిపారు. విద్యార్థిని తండ్రి.. నిందితుడు రోహిత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జిల్లా కేంద్రంలోని పానగల్‌ ప్రాంతానికి చెందిన విద్యార్థిని (21) స్థానిక ఎన్‌జీ కళాశాలలో ఇటీవలే బీబీఏ డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఇదే కళాశాలలో నల్గొండకే చెందిన మీసాల రోహిత్‌ (21) డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నారు. ఇతడితో విద్యార్థినికి పరిచయం ఏర్పడటంతో ఇదే అదునుగా గత కొంత కాలం నుంచి తనను ప్రేమించమని ఒత్తిడి చేస్తున్నాడు. తనకు ఇష్టం లేదని యువతి పలుమార్లు తిరస్కరించడంతో ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే దుర్బుద్ధితో రోహిత్‌ తన స్నేహితుడైన తాయిని సంప్రదించాడు.

రోహిత్ స్నేహితుడు తాయి తన స్నేహితురాలి ద్వారా విద్యార్థినిని మంగళవారం పట్టణంలోని ఒక పార్కుకు రప్పించారు. అప్పటికే అక్కడ రోహిత్‌ ఉండటంతో కంగారు పడిన విద్యార్థిని వెనక్కు వెళ్దామని ప్రయత్నించగా.. కాసేపు మాట్లాడుదామని రోహిత్ బలవంతం చేయడంతో పక్కకు వెళ్లింది. అదే సమయంలో మాట్లాడుతుండగానే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అప్పటికే తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో రోహిత్‌ పదిమార్లు విద్యార్థినిని పొడిచి పారిపోయాడు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని అక్కడే ఉన్న తాయి, మరో స్నేహితురాలు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు, వైద్యులు వెల్లడించారు.

Last Updated : Aug 10, 2022, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.