ETV Bharat / crime

Robbery in Train: సిగ్నల్​​​ తీగలు కత్తిరించి.. ఆ రైలులో దొంగల బీభత్సం - అనంతపురం జిల్లా లేటెస్ట్​ అప్​డేట్స్

Robbery in Train: తిరుపతి-సికింద్రాబాద్‌ రైలులో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి స్టేషన్​ సమీపంలో సిగ్నల్‌ తీగలు కత్తిరించి దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి నగలు, నగదు దోచుకెళ్లారు.

సిగ్నల్​​​ తీగలు కత్తిరించి.. ఆ రైలులో దొంగల బీభత్సం

author img

By

Published : Apr 9, 2022, 11:20 AM IST

Robbery in Train: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలోని తురకపల్లి వద్ద దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే 7 హిల్స్ ఎక్స్​ప్రెస్​ రైలు(12769) అనంతపురం నుంచి తురకపల్లి వద్దకు రాత్రి 9 గంటలకు చేరుకుంది. అయితే దుండగులు పథకం ప్రకారం అప్పటికే రైలు సిగ్నల్ వ్యవస్థను కత్తిరించడంతో రైలు తురకపల్లి ఔటర్ పట్టాలపై నిలిచిపోయింది. ఇదే అదనుగా భావించిన దుండగులు రైల్లోని ఎస్​5, ఎస్​7 బోగీల్లోకి చొరబడి ఇద్దరు ప్రయాణికుల నుంచి 6 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై ప్రయాణికులు మొదట గుత్తి పోలీసులకు సమాచారం అందించారు.

Robbery in Train: రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించి సిగ్నల్ వైర్లు తెగి ఉండటంతో వాటిని యథావిధిగా అమర్చి రైలును పంపించారు. అనంతరం బాధితులు డోన్​లోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాచిగూడ స్టేషన్​లోనూ విషయం తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసు వర్గాలు తెలిపాయి. సిగ్నల్ వ్యవస్థ కట్ చేసి ఇలా దోపిడీలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టి.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: అప్పు ఇచ్చిన వ్యక్తితో వివాహేతర సంబంధం.. సినీ ఫక్కీలో భర్త హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.