ETV Bharat / crime

మెుబైల్ షాపులో చోరీ.. రూ.2 లక్షల సొత్తు అపహరణ - robbery

చేతికి గ్లౌజులు, మంకీ క్యాప్ ధరించిన ఓ వ్యక్తి మొబైల్​ దుకాణంలోకి ప్రవేశించి రూ.70 వేల నగదుతో పాటు 2 లక్షలు విలువ చేసే సొత్తును దొంగలించాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో చోటు చేసుకుంది.

robbery-in-a-mobile-shop-in-east-godavari-district
ROBBERY: మెుబైల్ షాపులో చోరీ.. రూ. 2 లక్షల సొత్తు అపహరణ
author img

By

Published : Jun 16, 2021, 10:16 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ మొబైల్ దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం తలుపు తాళం పగలకొట్టి.. ఓ దొంగ లోనికి ప్రవేశించి సొత్తు అపహరించుకుపోయాడు. ఈ ఘటనలో రూ.70 వేల నగదుతో పాటు మొత్తం రూ.2 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైందని షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దొంగతనం జరిగిన సమయంలోని దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చేతికి గ్లౌజులు, మంకీ క్యాప్ ధరించిన నిందితుడు.. చోరీకి పాల్పడిన తీరును పోలీసులు అందులో గమనించారు. నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చోరీ జరిగిన ప్రదేశానికి చేరుకున్న క్లూస్ టీమ్ పలు ఆధారాలను సేకరించింది. చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు.

ROBBERY: మెుబైల్ షాపులో చోరీ.. రూ. 2 లక్షల సొత్తు అపహరణ

ఇవీ చదవండి: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.