Kadapa Robbery Case: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని రెడ్డి కాలనీలో వేణుగోపాల్ రెడ్డి భార్యతో కలిసి నివాసముంటున్నారు. రోజూలాగానే వాకింగ్ చేసేందుకు వేణుగోపాల్ ఉదయం బయటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో అతని భార్య ఒక్కరే ఉన్నారు.
కాలనీలో తిరుగుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు వచ్చి ఇంట్లో పని దొరుకుతుందా అని స్థానికులను అడిగారు. స్థానికులు పైఅంతస్తులో వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో పనిమనిషి కావాలని అడిగారని.. అక్కడికి వెళ్తే పని దొరుకుతుందని తెలిపారు. ఈ మేరకు అక్క, చెల్లెలు వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. పనిమనిషిగా చేరేందుకు వేణుగోపాల్ రెడ్డి భార్య సరే అంది. కొంత సమయం ఇంట్లో పని చేసిన తర్వాత.. తన చెల్లెలిని రోడ్డుపై వదిలేసి వస్తానని చెప్పి ఇద్దరూ బయటకు వెళ్లారు.
అక్కాచెల్లెలు ఎంతసేపటికీ రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చి బీరువా తెరిచి చూసింది. దానిలో ఉండాల్సిన బంగారు కమ్మలు, గొలుసులు, సుమారు రూ.3.5 లక్షలు విలువ చేసే బంగారు నగలను దొంగలించినట్లు గుర్తించి... బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనం చేసిన వారి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: chintal bike accident: వంద కిలోమీటర్ల వేగం.. రెప్ప పాటులో ఘోరం
woman suicide at srisailam: శ్రీశైలంలో వివాహిత ఆత్మహత్యాయత్నం... ఆమె చేతిలో ఏం ఉందంటే..!