కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఘట్ కేసర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్న కారు... డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ పోతున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
రోడ్డుకు అడ్డంగా కారు ఉండడంతో వరంగల్ జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మృతుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరి వద్ద ఉన్న ఆర్సీ ప్రకారం కూకట్‌పల్లికి చెందిన కృష్ణగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు.
కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన కారును స్థానికుల సహాయంతో పోలీసులు పక్కకు తీశారు.
ఇదీ చదవండి: Sex Racket News: నగరం నడిబొడ్డున బంగ్లాదేశ్ మహిళలతో వ్యభిచారం