ETV Bharat / crime

ద్విచక్రవాహనంపై వెళ్తూ పాదచారుడిని ఢీకొట్టిన యువకులు - హైదరాబాద్​ తాజా వార్తలు

రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతివేగంగా ద్విచక్రవాహదారుడు ఢీకొట్టడంతో పాదచారుడు కొంత దూరం ఎగిరిపడ్డ ఘటన... హైదరాబాద్ చింతల్‌లో చోటుచేసుకుంది. ఘటనలో ఒకరి కాలికి గాయాలు కాగా... బైక్‌పై వెళ్తున్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు.

Road accident in Chintal, Hyderabad
హైదరాబాద్​ చింతల్​లో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Apr 27, 2021, 7:35 PM IST

హైదరాబాద్​ చింతల్​లో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ చింతల్‌ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతివేగంగా ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టడంతో... పాదచారుడు కొంత దూరం ఎగిరిపడ్డాడు. పద్మనగర్‌కు చెందిన జగత్‌ సోమవారం మధ్యాహ్నం రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో షాపూర్‌నగర్ వైపు నుంచి బాలానగర్ వైపు ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు అతివేగంగా వెళ్తున్నారు.

ఆ సమయంలో రోడ్డు దాటుతున్న జగత్‌ను అతివేగంగా ఢీకొట్టారు. ఘటనలో జగత్‌ కాలికి గాయాలు కాగా... బైక్‌పై వెళ్తున్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. వారి ద్విచక్రవాహనానికి నెంబర్ ప్లేట్​తో పాటు వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.