road accident at Chillakur Mandal: ఏపీలోని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చేడిమాల సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర.. ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'సమ్మక్క జాతరకు బయల్దేరారు.. ఇల్లు కాలిందని ఫోన్ చేశారు'