వేగంగా దూసుకొచ్చిన ఓ కారు డివైడర్ను ఢీకొట్టిన సంఘటన బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వృద్ధురాలికి గాయాలయ్యాయి. బోయిన్పల్లి మార్కెట్ యార్డు ఎదుట ఉన్న డివైడర్ పైకి కారు ఎక్కడం వల్ల ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి కారును పక్కకు తప్పించి ఇతర వాహనాలకు లైన్ క్లియర్ చేశారు.
దాదాపు 60 ఏళ్ల వృద్ధురాలు కారులో వేగంగా రావడం మూలంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: చిన్నారి కిడ్నాప్... సురక్షితంగా కాపాడిన పోలీసులు