Anantapur Road accident : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద జీపు.. ఆటోను ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయదుర్గం ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ప్రమాదాలు
తెలంగాణలో నేడు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో కారు బీభత్సం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. హైదరాబాద్- విజయవాడ రహదారిపై జరిగిన ప్రమాదం కారణంగా.. భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.
మృత్యు ఒడికి
Banjara Hills Accident Today : నగరంలోని బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఉద్యోగులు విధులు ముగించుకుని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో నడుచుకుంటూ వెళ్తున్నారు. కొద్దిసేపట్లో వారి ఇంటికి చేరుకుంటారనగా.. రోడ్ నంబర్-2లో అతివేగంగా దూసుకొచ్చిన కారు.. వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
లారీని ఢీకొట్టిన కార్లు
Accident on Hyderabad- vijayawada Highway: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయరహదారిపై ప్రమాదం జరిగింది. హైదరాబాద్- విజయవాడ మార్గంలో లారీ యూటర్న్ చేస్తున్న సమయంలో.. ముందు వెళ్తున్న కార్లను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. బస్సు ఢీ కొట్టడంతో ముందున్న కార్లు.. లారీని ఢీ కొట్టాయి. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచి.. రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇదీ చదవండి: Banjara Hills Accident Today : బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. ఇద్దరు మృతి
Tags: road accidents today , road accidents in telangana , road accidents latest news , road accidents