ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన గతనెల 29న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితులు కొల్లిపర పోలీసులను ఆశ్రయించగా రాజీ కుదుర్చుకోవాలని చెప్పినట్లు బాలిక అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడితో పాటు అతని బంధువులు చంపేస్తామని బెదిరిస్తున్నారని బాలిక కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: నన్ను హిజ్రాగా మార్చారు.. ఆత్మహత్య చేసుకుంటున్నా..!