ETV Bharat / crime

Brutal Murder: భూత వైద్యం పేరుతో అత్యాచారయత్నం.. గొడ్డలితో నరికి హత్య.. ఆ తర్వాత... - ఏపీ వార్తలు

ఆమె ఓ రైతు.. కూలీలను పిలుద్దామని అలా వెళ్లింది. అంతలోనే అక్కడో భూతవైద్యుడు మాట కలిపాడు. మోకాళ్ల నొప్పులు కదా.. మందిస్తా రావమ్మా.. అంటూ లోపలికి తీసుకెళ్లాడు. తన కుక్క బుద్ధిని చూపించబోయాడు. ఆమె ప్రతిఘటించింది. ఇదేం పద్ధతంటూ ఛీత్కరించుకుంది. భూత వైద్యుడికి కోపమొచ్చింది. కాళ్లూ చేతులూ కట్టేశాడు. గొడ్డలితో విచక్షణారహితంగా నరికేశాడు. ఆ తర్వాత ఆ భూతవైద్యుడినీ...

rape-attempt-and-murder-on-woman-at-prakasam-district

author img

By

Published : Oct 18, 2021, 9:58 AM IST

భూత వైద్యం పేరుతో మహిళను నమ్మించి అత్యాచారయత్నానికి ప్రయత్నించడం.. ప్రతిఘటించిందంటూ గొడ్డలితో నరికి చంపడం.. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ప్రతీకారేచ్ఛతో పోలీసుల ఎదుటే కర్రలతో ఆపై నిందితుడిని కొట్టి చంపడం వంటి ఉదంతాలతో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామం ఆదివారం రాత్రి అట్టుడికింది.

కూలీలను పిలిచేందుకు వెళ్లి...

కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి అలియాస్‌ విజయ(42) వ్యవసాయ కూలీ మేస్త్రీగా జీవనం సాగిస్తోంది. పొలంలో సోమవారం ఉదయం పనులు చేసేందుకు కూలీలు అవసరమయ్యారు. వారిని పిలిచేందుకు రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో వుడ్డెపాలెం వెళ్లింది. పనుల కోసం కూలీలను పిలుస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన వల్లెపు ఓబయ్య(51) అనే భూతవైద్యుడు విషయాన్ని గమనించాడు.

నమ్మించి.. ఇంటికి పిలుచుకెళ్లి...

విజయలక్ష్మిని శారీరకంగా అనుభవించాలనే దుర్బుద్ధితో భూతవైద్యుడు ఓబయ్య ఆమెతో మాటలు కలిపాడు. ఆ సందర్భంలో మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నట్టు తెలుసుకున్నాడు. తాను నొప్పులు తగ్గించేందుకు మందులు ఇస్తానంటూ నమ్మించాడు. ఇంటిలోకి తీసుకెళ్లిన తర్వాత బలత్కరించేందుకు ప్రయత్నించాడు. ఊహించని పరిణామంతో విజయలక్ష్మి అతన్ని తీవ్రంగా ప్రతిఘటించింది.

కాళ్లు.. చేతులు కట్టేసి నరికివేత...

అత్యాచారయత్నం విషయం బయటికి తెలిస్తే తనకు ఇబ్బంది వస్తుందని ఓబయ్య భావించాడు. ఆమెపై దాడి చేసి కాళ్లు, చేతులు కట్టేశాడు. అనంతరం గొడ్డలితో నరికి ప్రాణాలు తీశాడు. ఈ హత్యోదంతాన్ని తన కుటుంబీకులకు చెప్పడంతో వారు జరుగుమల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రజియా సుల్తానా బేగం హుటాహుటిన తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడే ఉన్న నిందితుడు ఓబయ్యను తన వాహనంలో ఎక్కించుకుని స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు.

ఆగ్రహావేశాలతో ఊగిన ఊరు....

విజయలక్ష్మిని దారుణంగా హతమార్చిన విషయం తెలుసుకున్న కామేపల్లి గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పోలీసు వాహనంలో ఉన్న ఓబయ్యను బయటకు లాగి కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. అడ్డుకోబోయిన ఎస్సై రజియా సుల్తానా పైనా దాడి చేశారు. విచక్షణారహితంగా దాడి చేయటంతో ఓబయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

భారీగా పోలీసుల మోహరింపు...

మహిళ దారుణ హత్య, ప్రతీకార దాడిలో నిందితుడ్ని జనం కొట్టి చంపడంతో జరుగుమల్లి మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సంఘటనా స్థలంలోనే ఉన్న ఎస్సై ఇచ్చిన సమాచారంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్, సర్కిల్‌లోని ఎస్సైలు ఎం.సంపత్‌ కుమార్, షేక్‌ నాయబ్‌ రసూల్, యు.రాంబాబు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. సమాచారం తెలిసిన వెంటనే ఒంగోలు డీఎస్పీ నాగరాజు, కందుకూరు డీఎస్పీ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని పరిస్థితులపై ఆరా తీశారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.

క్షుద్ర పూజల అనుమానం...

హత్య, ప్రతీకార హత్య నేపథ్యంలో పోలీసులు అన్ని విషయాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. విజయలక్ష్మి హత్య జరిగిన చోట క్షుద్ర పూజలు చేశారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. బేల్దారీ పనులు చేసుకుని జీవనం సాగించే ఓబయ్య క్షుద్రపూజలు, భూతవైద్యం చేస్తుంటాడని అంటున్నారు. అత్యాచారం చేసే క్రమంలో ప్రతిఘటించిందని హత్య చేశాడా.. క్షుద్రపూజలు చేసేందుకు హత్య చేశాడా అనే అనుమానాలు నివృత్తి కావాల్సి ఉంది. మృతదేహంపై కొంతభాగం దుస్తులు లేకపోవటంతో అత్యాచారయత్నం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అనంతరం ఓబయ్యపై ప్రతిదాడికి పాల్పడిన వారి వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి: Human Trafficking Cases in Telangana : బీ అలర్ట్.. లైంగిక అక్రమ రవాణాలో మొదటిస్థానంలో తెలంగాణ!

Suicide Attempt: పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.