హైదరాబాద్ ఎల్బీనగర్‌లో యువతి (love maniac baswaraju)పై దాడికి పాల్పడిన ప్రేమోన్మాది బసవరాజు (love maniac baswaraju)ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి (love maniac baswaraju)ని రంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు బసవరాజు (love maniac baswaraju)ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
ప్రేమోన్మాది దాడి (love maniac baswaraju)లో గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో 24 గంటలు గడిస్తేనే పరిస్థితి చెప్పగలమని వెల్లడించారు. ఆస్పత్రికి చేరుకున్న యువతి తల్లిదండ్రులు, సోదరుడు... నిందితుడు బసవరాజు (love maniac baswaraju)ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరో 24 గంటలు గడిస్తే గాని ఓ అంచనాకు రాలేము
ఆస్పత్రికి తీసుకొచ్చే సమయంలో చాలా రక్తస్రావం జరిగింది. మరో 24 గంటలు తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తాం. మేజర్‌గా ఏమైనా గాయాలైనాయి అనేది స్కానింగ్ తర్వాత తెలుస్తుంది. సుమారుగా 18 గాయాలు ఉన్నాయి. ఇంటర్నల్‌గా ఏమైనా గాయాలు ఉన్నట్లు తేలితే దాన్నిబట్టి చికిత్స చేస్తాం.
-వైద్యులు
అసలేం జరిగింది..?
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్‌కు చెందిన యువతికి, అదే గ్రామానికి చెందిన బసవరాజు (love maniac baswaraju)తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. శిరీష, బసవరాజు ఇద్దరు హైదరాబాద్‌కు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. హస్తినాపురంలోని తన పిన్ని ఉమశ్రీ వద్ద ఉంటోంది. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. మూడు నెలల క్రితం ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిపించారు. కక్ష పెంచుకున్న బస్వరాజ్... పథకం ప్రకారం యువతిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.
చావు బతుకుల మధ్య..
తన ప్రియురాలిని వేరే ఇంటికి తరలించారన్న వార్త తెలుసుకుని.. ఆమె ఉంటున్న ఇంటి చిరునామా కోసం బసవరాజు (love maniac baswaraju) తీవ్రంగా వెతికాడు. మొత్తానికి ఆమె చిరునామా కనుక్కున్నాడు. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై కోపంతో.. కర్కషంగా దాడి చేశాడు (lover attack on his girl friend). తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి కడుపు, వెన్నులో పొడిచాడు. ఆమె శరీరంపై 18 చోట్ల గాయలున్నట్లు వైద్యులు గుర్తించారు.
వేరొకర్ని పెళ్లి చేసుకుంటున్నానని బస్వరాజు పొడిచాడు. గతంలో మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఇంట్లో ఒప్పుకోలేదు. ఇప్పుడు వేరే వ్యక్తితో నిశ్చితార్థమైంది. రోడ్డు మీద అందరూ చూస్తుండగా కత్తితో పొడిచాడు.
- బాధితురాలు
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు..!
బాధితురాలి అరుపులు విని స్థానికులు రావడంతో బసవరాజు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. బసవరాజు ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు బసవరాజు ను రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇదీ చూడండి: Attack on Girl friend: ప్రేమోన్మాది దాడి.. విషమంగానే యువతి పరిస్థితి