Neclace Road Rape Case: హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. జూబ్లీహిల్స్ ఘటన మరవకముందే కారులో అత్యాచారం చేశాడని మరో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సురేశ్ అనే యువకుడిని రామ్‌గోపాల్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 20న ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈనెల 4న బాలిక పోలీసులను ఆశ్రయించింది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన సమయంలోనే అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. కారులోనే సురేశ్ అత్యాచారం చేశాడని బాలిక ఫిర్యాదులో వెల్లడించింది. కేసు నమోదు చేసి సురేశ్‌ను రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అసలేలా జరిగిందంటే..: మల్లేపల్లి, విజయనగర్ కాలనీ ప్రాంతంలో జిరాక్స్ షాపులో పనిచేస్తుండే సురేశ్(23)కి హాస్టల్లో ఉంటూ కళాశాలకు వెళ్తున్న అనాథ బాలిక (17)తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమెతో తరచుగా బయట కలిసి మాట్లాడేవారని.. బాలికకు బహుమతిగా మొబైల్ కూడా ఇప్పించాడని పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 20న కళాశాలకు వెళ్తున్నానని హాస్టల్ వార్డెన్‌కు చెప్పిన బాలిక.. మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి స్నేహితుని పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ సురేశ్‌ను కూడా ఆహ్వానించింది.
జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు..: అదే రోజు రాత్రి 12 గంటలకు నెక్లెస్ రోడ్డుకు చేరుకోగా కొంతసేపటికే స్నేహితులు పుట్టినరోజు వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు. అదే అదునుగా భావించిన సురేశ్.. బాలికతో మాట్లాడేందుకు అని చెప్పి పక్కను తీసుకెళ్లి అక్కడున్న కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అనాథ కావడంతో ఆమె తరఫున గోల్కొండ ఐసీడీఎస్ సూపర్వైజర్ హుమయూన్ నగర్ పోలీసులకు ఈనెల 4న ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రాంగోపాల్ పేట్ పోలీసులకు సమాచారం అందించారు.
ఇవీ చదవండి: Jubilee Hills Case: మరోసారి బాలిక స్టేట్‌మెంట్ రికార్డు.. నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడి పేరు!
'తెలంగాణ ప్రస్తావన లేకుండా పారిశ్రామిక సమావేశాలు జరగడం లేదు'