ETV Bharat / crime

నిట్‌లో ర్యాగింగ్ కలకలం.. రూమ్‌కు పిలుపించుకుని మరీ... - seniors ragging on juniors at tadepalligudem nit

ఏపీలోని నిట్​ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్‌ విద్యార్థిపై తొమ్మిది మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. తాడేపల్లిగూడెం నిట్ క్యాంపస్‌లో దారుణం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ragging taza
నిట్‌లో ర్యాగింగ్ కలకలం
author img

By

Published : Mar 25, 2022, 3:35 PM IST

Ragging at NIT: ఆంధ్రప్రదేశ్​ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. విశాఖకు చెందిన సెకండియర్‌ విద్యార్థి జయకిరణ్‌పై సీనియర్‌ విద్యార్థులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. బుధవారం రాత్రి రూమ్‌కు పిలుపించుకుని తెల్లవారే వరకు విచక్షణారహితంగా సీనియర్లు కొట్టారని... తల్లిదండ్రులతో కలిసి కిరణ్‌ తాడేపల్లిగూడెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ragging taza
నిట్‌లో ర్యాగింగ్ కలకలం

గతంలో తనను సీనియర్లు కామెంట్‌ చేయగా... వెబ్‌సైట్‌ నుంచి వాళ్లకు మెసేజ్‌ చేశానని, అందుకు ప్రతీగానే దాడి చేసినట్లు కిరణ్‌ వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీనియర్‌ విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: Fake Certificates: ఫేక్ సర్టిఫికెట్లతో 30 ఏళ్లపాటు ఉద్యోగం.. చివరకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.