ETV Bharat / crime

ఫుడింగ్‌ అండ్‌ మింక్ పబ్​పై దాడి... స్పందించిన రేణుక చౌదరి - హైదరాబాద్​ డ్రగ్​ కేసు

Radisson Blu pub owner: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం రేగింది. బంజారాహిల్స్‌ రాడిసన్‌ హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్ పబ్‌లో మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. పక్కా సమాచారంతో రాత్రి పబ్‌పై దాడులు నిర్వహించి మత్తుపదార్తాలు పట్టుకున్నారు. పబ్‌లో అదుపులోకి తీసుకున్నవారిలో... సినీనటి నిహారిక, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా ఉన్నారు. పబ్​పై దాడి విషయంలో తన కుమార్తెపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి స్పందించారు.

renuka choudary
renuka choudary
author img

By

Published : Apr 3, 2022, 5:28 PM IST

Updated : Apr 3, 2022, 7:00 PM IST

Radisson Blu pub owner: హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ బయటపడింది. ముందుగానే సమాచారం ఉండటంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. వెస్ట్‌, సెంట్రల్‌, నార్త్‌జోన్‌ పోలీసులు పాల్గొన్నారు. పోలీసుల తనిఖీల్లో కొన్ని రకాల డ్రగ్స్‌తో పాటు కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ సిగరెట్లు, గంజాయి లభ్యమయ్యాయి. పబ్‌లో అప్పటికే 40 గ్రాముల కొకైన్‌ వాడేయగా.. 12 గ్రాములు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పబ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు...... యజమాని సహా 144 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇందులో సినీనటి నిహారిక, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సహా ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్నవారందనీ విచారించిన పోలీసులు... వారి వివరాలు సేకరించి వదిలేశారు.

పబ్​పై దాడి విషయంలో తన కుమార్తె తేజస్వి చౌదరిపై వస్తున్న ప్రచారాన్ని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి ఖండించారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రసారం చేస్తున్నాయని అన్నారు. పోలీసులు దాడిలో తన కుమార్తెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారని జరుగుతున్న ప్రచారం నిజం కాదని తెలిపారు. తన కుమార్తె ఫుండ్డింగ్ అండ్​ మింక్‌ యజమాని కాదని... రాత్రి అక్కడ లేదని వెల్లడించారు.

పబ్‌లో డ్రగ్స్‌ కలకలంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు... బంజారాహిల్స్‌ సీఐ, ఏసీపీపై వేటు వేశారు. బంజారాహిల్స్‌ సీఐ శివచంద్ర సస్పెండ్‌ చేశారు. ఏసీపీ సుదర్శన్‌కు పోలీసు కమిషనర్‌ ఛార్జ్ మెమో దాఖలు చేశారు. గతంలోనే పబ్‌పై పలుమార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణల వస్తున్న నేపథ్యంలో... ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

సంబంధిత కథనాలు:

Last Updated : Apr 3, 2022, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.