ETV Bharat / crime

SHE TEAMS: వేధింపుల కేసుల్లో అరెస్ట్​ చేసి.. కౌన్సెలింగ్​ ఇప్పించి..! - rangareddy district latest news

మహిళలు, యువతుల వేధింపుల కేసుల్లో అరెస్ట్​ చేసిన పలువురు నిందితులకు రాచకొండ షీ-టీమ్​ పోలీసులు కౌన్సెలింగ్​ నిర్వహించారు. 71 కేసుల్లో 53 మందికి ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా కౌన్సెలింగ్​ ఇప్పించారు.

వేధింపుల కేసుల్లో అరెస్ట్​ చేసి.. కౌన్సెలింగ్​ ఇప్పించి..!

author img

By

Published : Jun 18, 2021, 5:18 PM IST

కోడలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మామను రాచకొండ షీ-టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. భర్త, తండ్రీ అదే ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో కోడలు నిద్రిస్తున్న సమయంలో మామ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కోడలు వెంటనే షీ-టీమ్​కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మామను అరెస్టు చేశారు.

మరో కేసులో మేడిపల్లిలో నివాసం ఉండే ఓ ప్రభుత్వ ఉద్యోగిని స్నానం చేస్తున్న సమయంలో వెంటిలేటర్ నుంచి ఓ వ్యక్తి తొంగిచూడటం గమనించింది. వెంటనే భర్తకు విషయం చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడు శ్రవణ్​కుమార్​ను పట్టుకొని షీ-టీమ్ పోలీసులకు అప్పగించారు.

ఇలా రెండు నెలల వ్యవధిలో రాచకొండ షీ-టీమ్ పోలీసులు 71 కేసులు నమోదు చేశారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా మహిళలు, యువతులను వేధిస్తోన్న వారినీ అరెస్ట్ చేశారు. ఈ మేరకు 53 మందిని అరెస్ట్ చేసి వారికి భూమిక స్వచ్ఛంద సంస్థకు చెందిన కౌన్సిలర్లతో కౌన్సెలింగ్ ఇప్పించారు.

ఇదీ చూడండి: ప్రేమ రిజెక్ట్​ చేసిందని.. 22 సార్లు అతి దారుణంగా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.