సంస్థాన్ నారాయణపూర్‌లో పట్టుబడిన రేవ్ పార్టీ నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..... రేవ్ పార్టీలో మత్తు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.
నగరంలో పబ్‌లపై నిఘా పెరగడం వల్ల ఆర్గనైజర్లు శివారు ప్రాంతాల్లోని రిసార్టులు, ఫామ్ హౌస్‌లలో రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారు. నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని మత్తు పదార్థాలు అందుబాటులో ఉంచుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.....సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
మెయినాబాద్, శామీర్ పేట్, కీసర, షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లోని రిసార్టులు, ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు, ముజ్రాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: శివరాత్రి పూట రేవ్‌పార్టీ... పోలీసుల అదుపులో 90 మంది..