ETV Bharat / crime

DRUGS SEIZED AT HYDERABAD: డ్రగ్స్​ కంటే ప్రమాదకరమైన హాశిష్​ ఆయిల్​ స్వాధీనం: సీపీ - Hyderabad crime news

ఏపీలోని విశాఖ నుంచి హైదరాబాద్​కు అక్రమంగా తరలిస్తున్న రూ.9.8 లక్షల విలువైన డ్రగ్స్​ (హాశిష్​ ఆయిల్​)ను రాచకొండ పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్​ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని సీపీ మహేశ్​ భగవత్ తెలిపారు. ఫాస్ట్​ట్రాక్​ కోర్టుల ద్వారా నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని సీపీ వెల్లడించారు.

RACHAKONDA CP ON HASISH OIL
RACHAKONDA CP ON HASISH OIL
author img

By

Published : Sep 16, 2021, 4:59 PM IST

Updated : Sep 16, 2021, 6:26 PM IST

హైదరాబాద్​కు డ్రగ్స్​ను అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని ఎల్​బీనగర్​ ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏపీలోని విశాఖపట్టణం ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్​కు తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. ఈ ముఠాలోని శ్రీకాంత్​రెడ్డి, వెంకటేష్​, కొండల్​రావును అరెస్ట్​ చేసినట్లు సీపీ తెలిపారు. మరో నిందితుడు వెంకటరాజు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.9.8 లక్షల విలువైన హాశిష్​ ఆయిల్​, ఒక ద్వి చక్రవాహనం, 3 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

నిందితులు తయారుచేస్తున్న హాశిష్ ఆయిల్... ఇతర డ్రగ్స్ కంటే చాలా ప్రమాదకరమైనదని సీపీ తెలిపారు. ఒక్క చుక్క తాగిన ఎంతో ప్రభావం చూపుతుందన్నారు. గంజాయిని తీసుకొచ్చి.. మరిగించి.. అందులో నుంచి వచ్చే చిక్కని రసాయనాన్ని హాశిష్​ ఆయిల్​గా తయారుచేసి.. అక్రమంగా రవాణా చేస్తున్నారని సీపీ తెలిపారు. బహిరంగ మార్కెట్​లో దీని ధర 10 ఎంఎల్​ రూ.3300 ఉంటుందన్నారు. నిందితులపై గతంలోనూ కేసులున్నాయన్న సీపీ మహేశ్​ భగవత్​.. ఫాస్ట్ ట్రాక్​ కోర్టుల ద్వారా శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు.

డ్రగ్స్​ కంటే ఈ హాశిష్​ ఆయిల్​ విలువ ఎక్కువ ఉంటుంది. లీటర్​ సుమారు రూ.3 లక్షలకు విక్రయిస్తున్నారు. ఈ గ్యాంగ్​లో నలుగురు సభ్యులు ఉన్నారు. ముగ్గురిని అరెస్ట్​ చేశాం. విశాఖకు చెందిన వెంకట్​రాజు పరారీలో ఉన్నారు. మెదక్​, సంగారెడ్డి జిల్లాల్లోని కొందరు వ్యక్తులతో కుమ్మక్కై అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించాం.

మహేశ్​ భగవత్​, రాచకొండ సీపీ

ఇదీచూడండి: CYBER CRIME: ''మీకు కరోనా వచ్చిందా..? అయితే రూ.50 వేలు వస్తాయి''

Last Updated : Sep 16, 2021, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.