ETV Bharat / crime

సైకో వీరంగం.. రెండు కాలనీలు.. 9 బైకులు.. ఏం చేశాడంటే..? - తాజా నేర వార్తలు

ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఇళ్ల ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలకు నిప్పంటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

psycho virangam
సైకో వీరంగం
author img

By

Published : Sep 27, 2022, 12:33 PM IST

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్​స్టేషన్ పరిధిలోని వివేకానందనగర్, శ్రీనివాస కాలనీలలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కాలనీల్లోని ఇళ్ల ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రెండు కాలనీల్లో కలిపి 9 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పి వేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ వాహనాల విలువ సుమారు రూ.7 లక్షల వరకు ఉంటుందని.. నిందితుడిని వెంటనే పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.