ETV Bharat / crime

ప్లాట్లను ఆక్రమించారంటూ అమీన్​పూర్‌ పురపాలికలో ఆందోళన - protests in Ameenpur municipality area over occupation of plots at marriguda

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్‌ పురపాలిక పరిధిలో ప్లాట్ల ఆక్రమణపై వివాదం చెలరేగింది. ప్లాట్ల యజమానులకు, ప్రత్యర్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులతో ప్రత్యర్థి వర్గం అనుచితంగా ప్రవర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Ameenpur municipality, plots disputes
అమీన్పూర్‌ పురపాలికలో ఆందోళన
author img

By

Published : Mar 16, 2021, 4:52 PM IST

Updated : Mar 16, 2021, 6:08 PM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మున్సిపాలిటీలోని నర్రిగూడెం వద్ద తమ ప్లాట్లను ఆక్రమించారంటూ కొంతమంది ఆందోళనకు దిగారు. ప్లాట్ల యజమానులకు, ప్రత్యర్థి వర్గం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో గొడవను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులతో ప్రత్యర్థి వర్గం అనుచితంగా ప్రవర్తించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

147 మందికి చెందిన స్థలాలను ఆక్రమించి నిర్మాణ పనులు చేపట్టారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థలానికి సంబంధించి కోర్టులో స్టేటస్‌కో ఉండగా ప్రహారీ గోడ నిర్మించేందుకు... జేసీబీలతో చదును చేస్తున్నారని పోలీసులకు తెలిపారు. ప్లాట్లను తక్కువ ధరకు ఇచ్చేయాలని బెదిరిస్తున్నారని వాపోయారు. మున్సిపల్ ఛైర్మన్ పాండురంగారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ వద్ద స్థలానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయని వివరించారు. బాధితుల భూములను కాపాడాలని అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని పరిశీలించిన పోలీసులు... ఫిర్యాదు చేయాలని సూచించారు.

ప్లాట్లను ఆక్రమించారంటూ అమీన్పూర్‌ పురపాలికలో ఆందోళన

ఇదీ చదవండి: సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో విచారణ

Last Updated : Mar 16, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.