ETV Bharat / crime

వశీకరణతో లొంగదీసుకోవటమే ఆ పూజారి స్టైల్.. - అనంతపురంలో పూజారి బాగోతం

Priest illegal affairs: ఆలయానికి పూజల కోసం వచ్చిన మహిళలను, యువతులను తన మంత్రశక్తులతో వశీకరణ చేసి.. లైంగిక కోరికలు తీర్చుకోవడమే ఆయన స్టైల్. పూజలు పక్కనపెట్టి.. దేవాలయానికి వచ్చిన వారిని వశం చేసుకుని.. రాసలీలలు సాగించటమే ఆయన పని. ప్రశాంతత కోసం గుడికి వచ్చేవారిని తన వైపు తిప్పుకుని.. తప్పటడుగులు వేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన ఓ పూజారి కథ ఇది.

priest-illegal-affairs-with-women-at-ananthapur

author img

By

Published : Jul 13, 2022, 7:13 PM IST

Priest illegal affairs: దేవాలయానికి వచ్చిన మహిళలు, యువతులను తన మంత్రశక్తులతో వశీకరణ చేయటమే ఆ పూజారి స్టైల్. ప్రశాంతత కోసం గుడికి వచ్చే వారితో.. పూజారి రాసలీలలు సాగిస్తున్న ఘటన.. ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన తనకు 14 ఏళ్ల కిందట.. అనంతపురం జిల్లాకు చెందిన అనంతసైనతో పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని.. అతని భార్య స్రవంతి తెలిపారు. ఏడేళ్లుగా మానసికంగా, శారీరకంగా హింసిస్తుండేవాడని, విషయం పెద్దలకు చెప్పడంతో పలుమార్లు పంచాయితీలు కూడా పెట్టారన్నారు. ఆరు నెలల నుంచి దేవాలయానికి వచ్చే పలువురు యువతులు, మహిళలను లోబరుచుకుని వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, ఆడియో రికార్డులు తనకు దొరికాయని చెప్పారు. ఇదే విషయమై తాను నిలదీస్తే చంపేస్తానని బెదిరించాడన్నారు.

అంతేకాకుండా.. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగించడంపై భర్తను నిలదీయగా.. తనపై దాడిచేసి పుట్టింటికి పంపించినట్లు స్రవంతి వాపోయారు. తనకు విడాకులు కావాలని న్యాయవాదితో నోటీసులు పంపించాడని పేర్కొన్నారు. ఇదే విషయమై పెద్దమనుషులతో మాట్లాడేందుకు పుట్టింటి తరఫువారితో మంగళవారం ఉదయం మురడి గ్రామానికి వెళ్లినట్లు వివరించారు. కాగా.. ఆలయంలో చర్చించకుండా బయట తోటకి తీసుకెళ్లినట్లు వాపోయింది. అంతే కాకుండా.. తన కుటుంబసభ్యులందరిపై దాడి చేయించినట్లు వాపోయారు. రాసలీలలకు అడ్డుపడుతున్నానన్న నేపంతో తనను హతమార్చేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.