![Pregnant Woman Dies In Road Accident at The Himayatnagar Junction In Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg_hyd_51_24_accident_pregnancy_leady_dead_av_ts10005_1_2402digital_1614170395_311.jpg)
హైదరాబాద్ హిమాయత్‌నగర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి మృతిచెందింది. ముషీరాబాద్ బకారానికి చెందిన సతీశ్ గౌడ్, షాలిని దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా... ఆర్టీసీ బస్సు ఢీకొని అదుపుతప్పి కింద పడిపోయారు.
ఈ క్రమంలో మహిళ బస్సు వెనుక చక్రాల కింద పడిపోయింది. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో నారాయణ గూడ ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లేష్ వారిని ఎత్తుకొని అటుగా వెళ్తున్న అంబులెన్స్‌లో ఎక్కించారు. చికిత్స నిమిత్తం స్థానిక అపోలో హాస్పిటల్‌కు తరలించగా... తీవ్ర రక్తస్రావంతో మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండు ప్రాణాలు బలయ్యాయి. మృతురాలి భర్త సతీష్ గౌడ్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- ఇవీచూడండి: 'మంథనిలో లీగల్ ఫ్యాక్షన్ నడుస్తోంది'