Young men halchal in Hyderabad : హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్‌చల్ చేశారు. జిర్రా సమీపంలోని రాయల్స్ హోటల్ వద్ద గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. దీంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆదే సమయంలో ముఠా సభ్యులు పోలీసు వాహనమెక్కి బీభత్సం సృష్టించారు. పోలీసు వాహనంతో పాటు ఇతర వాహనాల అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
