ETV Bharat / crime

నగ్న మృతదేహం కేసు: ఆటోడ్రైవర్​పై రౌడీషీటర్​ కక్ష.. మందు పార్టీ ఇచ్చి మరీ..​ - నగ్న మృతదేహం హత్య కేసు

పాతబస్తీలో జరిగిన హత్య కేసును పోలీసులు వారం రోజుల్లోపే ఛేదించారు. లేక్ వ్యూ హిల్స్ ప్రాంతంలో కత్తి పోట్లతో నగ్నంగా ఓ మృతదేహం కనిపించిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఓ ఆటో, ద్విచక్ర వాహనం, కత్తి సహా 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

police solved old city naked murder case and arrested 5 accused

author img

By

Published : Sep 25, 2021, 7:05 PM IST

Updated : Sep 25, 2021, 8:04 PM IST

ఈ నెల 21న సంచలనం సృష్టించిన నగ్న మృతదేహం హత్య కేసు(naked dead body case)ను చంద్రాయణ్​గుట్ట పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గరి నుంచి ఒక ఆటో, ఓ ద్విచక్రవాహనం, కత్తి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రోజు చంద్రాయణాగుట్ట పోలీస్​స్టేషన్ పరిధిలోని లేక్ వ్యూ హిల్స్ ప్రాంతంలో కత్తి పోట్లతో నగ్నంగా ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్​ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు.. కార్వాన్​కు చెందిన ఆటోడ్రైవర్​ మహమ్మద్ ఆసిఫ్​గా గుర్తించారు. ముమ్మర విచారణ చేయగా.. ఆసిఫ్​ను లంగర్​హౌస్​కు చెందిన రౌడీ షీటర్ ఆదిల్... మరో నలుగురి సహాయంతో ఈ హత్య చేసినట్లు నిర్ధరించారు.

police solved old city naked murder case and arrested 5 accusedpolice solved old city naked murder case and arrested 5 accused
అరెస్టయిన నిందితులు

ఆటోడ్రైవర్​పై రౌడీషీటర్​ కక్ష..

లంగర్​హౌస్ పీఎస్​కు చెందిన రౌడీషీటర్ షేక్ ఇస్మాయిల్ అలియాస్​ ఆదిల్ ఓ దొంగ. బెదిరింపులకు పాల్పడడం.. ఎదురు తిరిగితే కొట్టడం.. అమ్మాయిలను వేధించడం.. లాంటి పనులు​ చేస్తాడని.. తనపై ఆసిఫ్​ ప్రచారం చేస్తున్నాడని ఆదిల్​ కక్ష పెంచుకున్నాడు. ఆసిఫ్​ను అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు. స్నేహితులు తాజుద్దీన్, షేక్ ఉస్మాన్, మహమ్మద్ సాహిల్, మహమ్మద్ రెహన్​తో కలిసి 20వ తేదీన ఆదిల్​ పథకం రచించాడు.

మందు తాగించి..

పురాణాపూల్ పార్థివడలో రాత్రి మద్యం పార్టీ ఏర్పాటు చేయాలని ఆదిల్​ తన సహచరులకు చెప్పాడు. ఆసిఫ్​ను తన వెంట తీసుకోచ్చాడు. అందరూ కలిసి పార్టీలో పూటుగా మద్యం సేవించారు. పథకం ప్రకారం.. ఆసిఫ్​తో చిన్నగా వాగ్వాదానికి దిగాడు. గొడవ పెద్దది కాగానే.. వెంట తెచ్చుకున్న కత్తితో ఆసిఫ్​ను ఆదిల్​ దాడి చేశాడు.

అతడి ఆటోలోనే మృతదేహం..

రక్తపు గాయాలతో ఉన్న ఆసిఫ్​ను అతడి ఆటోలోనే లేక్ వ్యూ హిల్స్ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఆటోలో నుంచి ఆసిఫ్​ను బయటకు దింపి.. మళ్లీ కత్తితో గొంతు కోశాడు. ప్రాణం పోయిందని తెలిశాక అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఆసిఫ్​ దేహాన్ని ఆటోలో నుంచి కిందకు దింపే సమయంలో బట్టలు చినిగిపోయి ఉంటాయని పోలీసులు తెలిపారు.

police solved old city naked murder case and arrested 5 accused
పోలీసులకు రివార్డులు
సిబ్బందికి రివార్డులు..

సంచలన కేసును ఛేదించి... కరుడుగట్టిన పాత నేరస్థుడు ఆదిల్​తో పాటు 5 మంది నిందితులను పట్టుకున్న క్రైమ్ టీం డీఐ వీరయ్య, డీఎస్​ఐ గౌస్ ​ఖాన్, ఎస్సైలు వెంకటేశ్, జాకీర్​​... పలువురు కానిస్టేబుల్​లను డీసీపీ, అదనపు డీసీపీ, ఏసీపీ అభినందించారు. డీసీపీ తన చేతుల మీదుగా అందరికి రివార్డ్ అందజేశారు.

ఇవీ చూడండి:

Last Updated : Sep 25, 2021, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.