అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువ చేసే గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారు. ఏపీ, తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటుగా మామిడికాయల లోడుతో వచ్చిన వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో మామిడి కాయల బస్తాల కింద భారీ స్థాయిలో గంజాయి ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. వాహనం డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ రాహుల్, సాల్మన్ అనే ఇద్దరు వ్యక్తులు... ఏపీలోని విశాఖపట్నం నుంచి సుమారు ఆరున్నర క్వింటాళ్ల గంజాయిని కొనుగోలు చేశారు. దాన్ని యూపీకి తరలించేందుకు విజయనగరానికి చెందిన వాహనాన్ని అద్దెకు మాట్లాడుకున్నారు. వాహనం అడుగున గంజాయి ప్యాకెట్లు వేసి పైన మామిడి కాయల బస్తాలను వేసుకొని తీసుకువెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వాహనంలో 130 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని వాటి విలువ సుమారు కోటి రూపాయలకు పైగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Mother Sold Son: రూ.15 వేలకు కొడుకుని అమ్మేసిన తల్లి